బుడతనపల్లిలో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం
గజపతినగరం నియోజకవర్గం: గంట్యాడ మండలం, బుడతనపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి, జనసేన-టిడిపి జెఏసీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన పిఎసి సభ్యురాలు, గజపతినగరం నియోజవర్గ నాయకురాలు, మాజీ మంత్రి శ్రీమతి పడాల అరుణ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజవర్గ జనసేన నాయకులు మర్రపు సురేష్, ఆధాడ మోహన్, గంట్యాడ జనసేన పార్టీ మండల అధ్యక్షులు సారాది అప్పలరాజు, జనసేన పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/gh-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-05-at-18.19.00-776x1024.jpeg)