మడకశిర, పెనుగొండ రోడ్డులో శుక్రవారం చిరంజీవి యువత నియోజకవర్గ నాయకులు వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి జనసేన కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో 5 మండలాల నాయకులు పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రంగస్వామి, మంజు, నాగరాజు, సురేంద్ర, మహేష్,, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment