నైనవరంలో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

గన్నవరం నియోజకవర్గం: విజయవాడ రూరల్ మండలం, పిర్యాది నైనవరంలో పుచ్చకాయల నాగరాజు మరియు గ్రామ జనసేన కమిటీ సభ్యుల అధ్వర్యంలో అమ్మిశెట్టి వాసు చేతుల మీదుగా గ్రామ నూతన జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ నా చేతుల మీదుగా గ్రామ నూతన జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం చాలా ఆనందాన్ని కలిగించిందని ! ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జనసేన పార్టీలోకి గ్రామ పెద్దలను మరియు యువకులను, జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగ ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్, విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు దొంతి చిన్నారావు, కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జలపూడి బాబూరావు, రూరల్ మండల అధ్యక్షులు గొడ్డళ్ల చినరామారావు, జనసేన పార్టీ రూరల్ మండల కమిటీ సభ్యులు, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, నాయకులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు.