తాడిపత్రిలో ఘనంగా జనసేన కార్యాలయాల ప్రారంభం

తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి, పెద్దవడుగూరు మరియు పెద్దపప్పూరు మండలాలలో జనసేన పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం ఆదివారం జనసైనికుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమాలకు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్, జనసేన పార్టీ రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ సెక్రటరీ భవాని రవికుమార్, అనంతపురం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది. మొదట పెద్దవడుగూరు మండలంలోని పార్టీ కార్యాలయాన్ని ఆ మండల అధ్యక్షుడు దూద్వలి మరియు జనసైనికులతో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలతో ముచ్చటించారు. రాబోయే ఎన్నికల కోసం ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ కలసి కష్టపడాలని పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో సూచనలు అందించారు. ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం పెద్దపప్పూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జనసైనికులు జనసేన నాయకులను అడిగి మండల సమస్యలను కనుక్కున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసే విధంగా ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అనంతరం అదే మండలానికి చెందిన జ్యోతి అనే బాలింత వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని వారి కుటుంబ సభ్యుల ద్వారా పూర్తిగా తెలుసుకొని జనసేన పార్టీ తరపున పోరాడుతుందని భరోసా కల్పించారు. అనంతరం తాడిపత్రి చేరుకుని తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం తాడిపత్రి యాడికి పెద్దవడుగూరు పెద్దపప్పూరు మండలాలకు సంబంధించిన జనసైనికులతో జనసేన నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.