ఘనంగా మహతి హోటల్ ప్రారంభోత్సవం

*మహతి హోటల్ ప్రారంభోత్సవంలో జనసేన నేతల సందడి

మదనపల్లి నియోజకవర్గం, రామసముద్రం మండలంలోని చెంబకూరు గ్రామంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చాకలి విశ్వనాథ్ ఏర్పాటు చేసిన మహతి హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, ప్రముఖ విద్యావేత్త సదుం రవీంద్రనాథ్ మరియు బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ హాజరై హోటల్‌ను ప్రారంభించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, పార్టీ నాయకులు గజ్జల రెడ్డప్ప, మదనపల్లి రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మండల సెక్రటరీ క్రాంతి బంగారం, స్థానిక నాయకుడు బాబు మరియు చెంబకూరు పంచాయతీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో మహతి హోటల్ ప్రారంభించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Share this content:

Post Comment