ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

కొండెపి, జనసేన పార్టీ వ్యవస్థాపకులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సింగరాయకొండ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు అయినాబత్తిన రాజేష్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇంచార్జ్ మేడ రమేష్ నాయుడు హాజరై కేక్ కట్ చేసి యువకులతో కలిసి పంచుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ మేడ రమేష్ మాట్లాడుతూ 2024 లో ఈ అరాచక పాలన పోయి ప్రజల పాలన వస్తుందని అన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సుకై కృషి చేస్తున్నా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజ్యమేలుతడాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.