ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

తిరుపతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పిఏసి సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ సలహా మేరకు సీనియర్ నాయకులు చింతకాయల కృష్ణయ్య తిరుపతిలోని వైకుంఠపురం ఆర్చ్ దగ్గర భవన కార్మికులకు అన్నదాన కార్యక్రమం, అలాగే లక్ష్మీపురంలోని, అంగనవాడి స్కూల్లో, ప్రెషర్ కుక్కర్స్, గర్భిణీలకు మందుల పంపిణీ, పిల్లలు రాత్రిపూట పడుకునే దానికి సిరి చాపలు, పిల్లలకు పుస్తకములు, పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు, అలాగే ఎస్ టి వి కాలనీ అంబేద్కర్ స్కూల్లో, ప్రెజర్ కుక్కర్స్, గర్భిణీ స్త్రీలకు మెడిసిన్స్, పిల్లలు రాత్రివేళ పడుకునే చాపలు, పిల్లలకు పుస్తకములు చాక్లెట్లు, అలాగే పద్మావతి పురం లోని, అంగన్వాడి స్కూల్ కు ప్రెషర్ కుక్కర్, స్టీల్ ప్లేట్స్, బిందె, పిల్లలకు బుక్స్, అన్నిచోట్ల పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం, పి ఆనంద్ జనసేన సెక్రెటరీ పుట్టినరోజు సందర్భంగా వారికి దుశ్శాలువా కప్పి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో, తిరుపతి జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు, అంగన్వాడి స్కూల్ కి సంబంధించిన టీచర్స్, పిల్లలు, పాల్గొని, పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు, ప్రతి సంవత్సరం వంగరంగ వైభవంగా రాష్ట్రవ్యాప్తంగా పుట్టినరోజు కార్యక్రమం జరుపుకునేలాగన, భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ప్రసాదించాలని, రాజకీయాల్లో, 2024లో విజయం సాధించి, ముఖ్యమంత్రి కావాలని కోరడం జరిగింది.

  • డా.పసుపులేటి హరిప్రసాద్ లక్ష రూపాయల విరాళం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పిఏసి సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ నా సేన కోసం నా వంతు బాధ్యతగా లక్ష రూపాయలు పార్టీకి అందించడం జరిగింది. జనసేన పార్టీ తిరుపతి పిఏసి ఆఫీస్ నందు అధినేత పవన్ కళ్యాణ్ బ్యానర్ కి పాలాభిషేకం, జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, జనసేన రాష్ట్ర, జిల్లా కార్యవర్గ నాయకులు తిరుపతి పట్టణ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.