దర్శిలో ఘనంగా జనసేనాని జన్మదినోత్సవ వేడుకలు

  • 500 బైకులతో భారీ ర్యాలీ
  • 51 కేజీల భారీ కేక్ కటింగ్
  • మెగా బ్లడ్ బ్యాంకు నిర్వహణ

దర్శి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక పురస్కరించుకుని జనసేన నినాదాలతో హోరెత్తిన దర్శి నియోజకవర్గం. జనసేన అధినేత వేడుకలకు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజుకి కి ఘన స్వాగతం పలికిన దర్శి నియోజకవర్గ జనసైనికులు. జన్మదిన వేడుక పురస్కరించుకుని సుమారు 500 నుండి 600 బైకులతో సాగర్ కాలువ నుండి దర్శి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు. దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరింత గుర్తింపు తీసుకొచ్చిన వరికూటి నాగరాజు. బైక్ ర్యాలీ అనంతరం పద్మావతి కళ్యాణ మండపంలో 51 కేజీల భారీ కేకును జనసైనికుల సమక్షంలో కట్ చేసి మెగా బ్లడ్ బ్యాంక్ క్యాంపును ప్రారంభించిన వరికూటి నాగరాజు. అనంతరం సుమారు 2000 మందికి భోజనం వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.