దెందులూరులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

దెందులూరు నియోజకవర్గం, దెందులూరు మండలంలోని గోపన్నపలెం, పోతునూరు గ్రామాలలో, పెదవేగి మండలంలోని పెదవేగి, రామశింగవరం గ్రామాలలో తీన్మార్ డప్పులతో, దెందులూరు నియోజకవర్గ యువత వెల్లువెత్తిన ఉత్సాహంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ నాయకత్వంలో అడుగడుగునా వారికి బ్రహ్మరథం పడుతూ, జనసేనానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, హోరెత్తిన జయజయ ధ్వానాల మధ్య జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు.