ఘనంగా కరాటం రాంబాబు జన్మదిన వేడుకలు

పోలవరం: ఏజెన్సీ టైగర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ డి.సి.సి.బి. చైర్మన్, సీనియర్ రాజకీయ నాయకులు, అప్ ల్యాండ్ ఏరియాకు పెద్ద దిక్కు, నమ్ముకున్నవారికి కష్టం వస్తే నేనున్నా అని ధైర్యాన్ని చెప్పి, భరోసా కల్పించిన రైతుబందు కరాటం రాంబాబు జన్మదిన వేడుకలు బుట్టాయిగూడెంలో వారి స్వగృహమునందు ఘనంగా సాగాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు కుమార్, నియోజకవర్గం ఇంచార్జ్ చిర్రి బాలరాజు, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జ్ సువర్ణ రాజు, ఉంగుటూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చమట్ల ధర్మరాజు, చింతలపూడి నియోజకవర్గం ఇంచార్జి మేకా ఈశ్వరయ్య, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలా నాయకులు, ప్రముఖులు పార్టీ నాయకులు, స్థానిక పోలవరం నియోజకవర్గ ఏడు మండలాల అధ్యక్షులు మండల కమిటీ నాయకులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, పాత్రికేయులు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగులు, సన్నిహితులు శ్రేయోభిలాషులు భారీగా వచ్చి గజమాలలు వేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ ర్యాలీగా వెళ్లి బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు గుడ్లు, పండ్లు పంపిణి కార్యక్రమం చేశారు.