మహాశివరాత్రి సందర్భంగా బుధవారం సిటిఎం రోడ్ లో గల శ్రీ మంజునాథ స్వామి ఆలయం వద్ద పట్టణ అధ్యక్షుడు జగదీష్ బాబు నాయిని ఆధ్వర్యంలో మదనపల్లి యువ నాయకులు హరిహరన్ సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ.. ఆ పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సిఐ రాజేంద్ర, రిటైర్డ్ హెడ్మాస్టర్ సోమశేఖర్, కుమార్ రాయల్, లతీఫ్, అశోక్, సోను, నవాజ్, ఉమా, హర్ష, సత్య, దినకరచౌదరి, పునీత్ చౌదరి, రియాన్, సుహేల్, భాను, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment