ఘనంగా ముమ్మారెడ్డి జన్మదిన వేడుకలు

కూకట్ పల్లి, నిరంతర ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ, గెలుపైనా, ఓటమైనా ప్రజలతోనే నా జీవనం అంటూ జన సైనికులందరిలో స్ఫూర్తిని నింపుతూ ముందుకు సాగుతున్న జననేత కూకట్పల్లి నియోజకవర్గ జనసేన కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ జన్మదిన వేడుకలు కూకట్ పల్లి 5వ ఫేజ్ లోని జనసేన కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అభిమానులు మరియు కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేయడం జరిగింది. అనంతరం అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, అభిమానులు, మిత్రులు శ్రేయోభిలాషులు, పార్టీలకి అతీతంగా పాల్గొని ప్రేమ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.