ఘనంగా జనసేన చలివేంద్రం ప్రారంభం

కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గ జనసేన నాయకులు కల్లూరు మండల అధ్యక్షుడు వై బజారీ ఆధ్వర్యంలో చిన్నటేకూరు శ్రీ శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో జనసేన చలివేంద్రమును జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా బజారి మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల దాహం తీర్చేందుకు గత 10 సంవత్సరముల నుండి చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 20 గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కలుస్తున్నారని మధ్యాహ్న సమయంలో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ఉచితంగా చలివేంద్రం ప్రారంభించామన్నారు. వారంలో ఒకరోజు మజ్జిగ మరొక రోజు బెల్లం పానకం మిగతా రోజులు మినరల్ వాటర్ అందుబాటులో ఉంచుతామని, అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు వెంకటసుబ్బయ్య సార్, (మత్స్యకార విభాగ కమిటీ రాష్ట్ర కార్యదర్శి) తెలుగు గోవిందరాజు, సి.హుస్సేన్ పవర్ (కర్నూలు జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుడు) నియోజకవర్గ జనసేన నాయకులు బి.సుధాకర్, షబ్బీర్, నాగేష్, భాస్కర్, అంజి, శివ, సలాం, రాజు, వరప్రసాద్, సి. మంజు, రాజేంద్ర, రవి, రంగస్వామి, ఎల్లా రాముడు, బి.అంజి, జి.శివ, తిమ్మరాజు, ఎన్న్ శివ నబిసాబ్, ఖాజావలి, మాధవయ్య మరియు గ్రామ జనసైనికులు కార్యకర్తలు పాల్గోన్నారు.