ఘనంగా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

కర్ణాటక కోలార్ జిల్లాలో జరిగిన కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షుడైన మురళి గౌడ మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ పేరులో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉన్న జనసేన కార్యకర్తలకి ఏ కష్టమొచ్చినా కూడా కర్ణాటక తరఫున మా వంతు అనే సహాయాలు చేసుకొని వస్తున్నాము. ముందుటి రోజుల్లో కూడా అలాగే ముందుకు నడిపిస్తాము. అయితే కర్ణాటకలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక ఆశ ఉంది. పవన్ కళ్యాణ్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడని, వచ్చే రోజుల్లో జనసేన పార్టీ అనేది కర్ణాటకలో కూడా రావాలని, అలాంటి వ్యక్తి భారతదేశానికి కావాలని కర్ణాటకలో ఉన్న అభిమానుల కోరిక అని, కర్ణాటకకి జనసేన పార్టీ వస్తుందంటే ఎంత కష్టమైనా పడడానికి కర్ణాటకలో ఉన్న అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సేవా సంఘంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఎల్లప్పటికీ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నానని అన్నారు. కర్ణాటకలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు బట్ట బ్యాగులని అందించడం జరిగినది. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన జన సాగరాలకి భోజనాల్లో వ్యవస్థ కూడా చేయడం జరిగినది. ఈ కార్యక్రమం అద్భుతంగా నిరూపించిన వాళ్ళు కోలార్ జిల్లా అధ్యక్షుడు ఎంపీ ఎస్ మంజునాథ్, ములభాగులు తాలూకా అధ్యక్షులు సుబ్రమణి, ఉపాధ్యక్షులు మంజునాథ్ కార్యకర్తలు రాష్ట్ర గోరువా అధ్యక్షులు మంజునాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, రాష్ట్ర సలహా అధ్యక్షుడు సంతోష్, బెంగళూరు నగర అధ్యక్షుడు మంజునాథ్, కన్నడ ఫిలిం నిర్దేశకులు రాజు, కులం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదర్శ్, కోలార్ జిల్లా ఉపాధ్యక్షుడు మధు, శ్రీనివాసపురం తాలూకా అధ్యక్షులు రమే గౌడ, బంగారు పెట్టే తాలూకా అధ్యక్షులు శశి కిరణ్, పదాధికారులు యారబ్, కిరణ్, మూర్తి, గంగాధర్, మునీంద్ర, మంజు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment