ఏలూరు జనసేన కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ అధ్యక్షత వహించారు. ముందుగా జనసేన పార్టీ నాయకులు రాఘవయ్య చౌదరి, మాజీ ఎమ్మార్వో గుబ్బల నాగేశ్వరరావు బి.ఆర్.అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెడ్డి అప్పల నాయుడు జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ బి.ఆర్. అంబేద్కర్ గారి యొక్క సారధ్యంలో భారత దేశ రాజ్యాంగ నిర్మాణంలో ప్రపంచంలోనే అతి బలమైన రాజ్యాంగాన్ని నిర్మించి ఆరోజు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా విభిన్నమైన ఒక చట్టం దుర్మార్గమైన ప్రభుత్వాలు ముఖ్య మంత్రులు లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ చట్టాలను కాలరాస్తు బలమైన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలకులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆరోజుల్లో ఏదైతే తెల్లదొరల పాలన నుండి విముక్తి చెంది దేశానికి స్వాతంత్య్రం వచ్చిందనే భ్రమలో ఈ దేశ ప్రజలు జీవిస్తున్నారు. కానీ నేడు దేశంలో డా.బి.ఆర్.అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ నేటి నల్లజాతి పాలకులు నియంతన పాలనా అందిస్తున్నారు.. ఒక ప్రక్కన ప్రజా సమస్యల మీద అవగాహన చేసుకొనే ప్రతిపక్షాలకు హక్కుని లేకుండా చేయడం దానికి అనుగుణంగా జీవో నెం.1నీ తీసుకురావడం సరైన విధానం కాదని ప్రభుత్వం పై రెడ్డి అప్పల నాయుడు మండి పడ్డారు.. ఈ రోజుల్లో ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులు, ప్రజల హక్కు కాలరాస్తు ప్రజల సంపదను కొల్లగొడుతూ వారి స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ప్రజాసంఘాలు కానీ, ప్రతిపక్షాలు గాని, మేధావి వర్గాలు కానీ, నాయకులు గానీ, విద్యార్థులు గాని ఈ యొక్క న్యాయవ్యవస్థ గాని రాజ్యాంగం గురించి మాట్లాడే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి జనసేన పార్టీ తరఫున జనసైనికులకు, వీరమహిళలకు మెగా అభిమానులకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు మరో పోరాటానికి ప్రజలందరూ సిద్ధం కావాలని భారత రాజ్యాంగాన్ని బి.ఆర్. అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని ఈ సంపదను ప్రజలకు అందే విధంగా మనం నిరంతరం పోరాటానికి సిద్ధం కావాలని తెలియజేస్తున్నాం అని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, పల్లి విజయ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కూర్మా సరళ, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, కోలా శివ, చిత్తరి శివ, నాయకులు రామకృష్ణ, మడుగుల మాణిక్యాలరావు, బుధ్ధా నాగేశ్వరరావు, రాచప్రోలు వాసు, భూపతి, నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, అధత్ర సురేష్, బొద్దపు గోవిందు, బాబు, వీరమహిళలు తుమ్మపాల ఉమాదుర్గ, కోలా సుజాత, గన్నవరపు ప్రియా రాణి, దుర్గా.బి తదితరులు.