డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా అక్కల గాంధీ ఘననివాళి

మైలవరం, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల గాంధీ ఘన నివాళులు అర్పించడం జరిగింది. భారతమాత ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పూలమాల వేసి వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల గాంధీ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ద్వారానే మనం ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్రం కలిగి జీవిస్తున్నామని, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఆయన తపన, మానవత్వం చాలా గొప్పదని వారి ఆశయాలలో నుంచి పుట్టిన జనసేన పార్టీ వారి బాటలో నడుస్తూ మరింతమందికి బాసటగా నిలుస్తుందని తెలియజేస్తూ ప్రతి జనసైనికుడు వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేరుకుమల్లి సురేష్, యర్రంశెట్టి నాని, దేవబత్తుల నాగబాబు, సామల సుజాత, బొమ్మల రమేష్, చరణ్, అరిగే కళ్యాణ్, యర్రంశెట్టి సాయి, అనం మహేష్, పవన్ కళ్యాణ్, సామల శ్రీనివాసరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.