ఘనంగా అల్లూరి విగ్రహా ఆవిష్కరణ

*ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

మలికిపురం: స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని మలికిపురం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అల్లూరి దేశానికి చిరస్మరణీయ సేవలందించిన గొప్ప వీరుడు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అల్లూరి సూర్యనారాయణ రాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అల్లూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment