పిఠాపురం, చిత్రాడ గ్రామంలో మార్చి 14 న జరగబోవు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణంలో జనసేన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్న అధికారులతో తగు జాగ్రత్తలు గురించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మరియు “సాహసించాం…సంగ్రమించాం…సంభ్రమించే విజయాన్ని సాధించాం రండి పొంగే కెరటాల ఉత్సవం చేసుకుందాం…” అనే స్లోగన్ తో జయకేతనం పోస్టర్ ను ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment