రాయచోటి నియోజకవర్గంలోని శిబ్యాల గ్రామం (ముష్టి మాకులపల్లి) తొగటపల్లెలో నూతనంగా నిర్మించిన చౌడేశ్వరి దేవి గుడిలో శుక్రవారం మధ్యాహ్నం విగ్రహావిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మరియు టీడీపీ బీసీ సాధికార సమితి పాల ఏకరి రాష్ట్ర కన్వీనర్ గురిగింజకుంట శివ ప్రసాద్ నాయుడు (గుట్ట బాబు) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ అనంతరం గ్రామ ప్రజలు రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మరియు శివ ప్రసాద్ నాయుడు లకు శాలువాలు, గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరు దేవి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దు శెట్టి రామయ్య, భోజనపు నాగేష్, తుమ్మ గింజల వెంకటరమణ, చిన్నకోట్ల హరీష్, ముద్దు శెట్టి వెంకటేష్, ముద్దు శెట్టి లక్ష్మి, తుమ్మ గింజల రాంబాబు, బూమల నారాయణ సహా పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చౌడేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన గ్రామస్తులు, భక్తులు ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

Share this content:
Post Comment