ఘనంగా మిలాద్-ఉన్-నభి ప్రత్యేక ప్రార్థనలు

తిరువూరు నియోజకవర్గంలో మిలాద్- ఉన్- నబీ  ప్రత్యేక ప్రార్థనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ముస్లిం సోదరులు.మహ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజును మిలాద్ ఉన్ నబీగా ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్ధనలతో జరుపుకున్నారు. తిరువూరు, విస్సన్నపేట, ఏ- కొండూరు,గంపలగూడెం మండల్లాలోని ఆయా మస్జీద్ లలో ఇస్లాం మత గురువులు ప్రసంగిస్తు. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని వివరించారు. జామియా మస్జీద్ ఇస్లాం మతగురువు రిజ్వి ఖురాన్ గ్రంథంలోని ప్రవక్త మహమ్మద్ యొక్క విశిష్టతను వారి శాంతియుత మార్గాన్ని తెలిపారు