చైతు సరసన అవికాగోర్ కు అదిరిపోయే చాన్స్..

చిన్నారి పెళ్లికూతురు సినిమాతో ఆకట్టుకున్న అవికాగోర్ కు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సరసన చాన్స్ వచ్చిందని తెలుస్తుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు థ్యాంక్యూ అనే ఇంట్రస్టిగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తుంది. అందులో ఓ హీరోయిన్ గా అవికా ఎంపిక అయ్యిందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రియాంక అరుల్ మోహన్, రకుల ప్రీత్ సింగ్ తోపాటు మూడో హీరోయిన్ గా అవికా ఎంపిక చేశారని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో అవికా జాయిన్ అవుతుందని అంటున్నారు. మరి ఈ సినిమాతో అవికా కెరియర్ ఊపందుకుంటుందెమో చూడాలి.