రోడ్ల దుస్థితిపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి విశేష స్పందన

*సోషల్ మీడియాలో #GoodMorningCMSir ట్రెండింగ్ జోరు
ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ మూడు రోజులపాటు తలపెట్టిన #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన ఈ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో విస్తృత ప్రాచుర్యంలో ఉంది. ట్విట్టర్లో 1, 2 స్థానాల్లో కొనసాగుతోంది. క్యాంపెయిన్ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే 1.66 లక్షల ట్వీట్లు రావడం విశేషం. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ఫోటోలు, వీడియోల ద్వారా #GoodmorningCMSir హ్యాష్ ట్యాగ్ తో ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా కృషి చేస్తున్నారు. ట్విట్టర్ తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల మీదా ట్రెండింగ్ జోరు కనిపిస్తోంది.