జనసేన అధ్వర్యంలో ఈగల తిరుపతిరావుకి ఘన సన్మానం

తెలంగాణ, కూకట్‌పల్లి: బెంగళూరులో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ కాంగ్రెస్ లో బంగారు పతకం సాధించిన సందర్భముగా కెపిహెచ్బి కాలనీ 5 ఫేస్ లో గల విష్ణుశ్రీ హోటల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో జనసైనికుడు ఈగల తిరుపతిరావుని కూకట్పల్లి నియోజకవర్గం జనసేన నాయకులు కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు కొల్లా శంకర్ మరియు తుమ్మల మోహన్ మాట్లాడుతూ ఈగల తిరుపతిరావు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కూడా ప్రతిభను సాధించాలని ఇలాంటి యువకులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ మరియు జనసైనికుల సహకారం ఎల్లవేళలా ఉంటుందని, క్రీడా రంగంలో ప్రోత్సహిస్తున్న గురువులకు మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పవర్ లిఫ్టింగ్ లొ ప్రతిభగల యువతి, యువకులను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి తగు సదుపాయాలతో ఆర్థికంగా సహకరించి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి జనసేన పార్టీ నాయకులు 114 డివిజన్ ప్రెసిడెంట్ కలిగినిడి ప్రసాద్, కళ్యాణ్, నాని తెలగారెడ్డి, శివాజీ కందుల, సతీష్, రవి మరియు జనసైనికులు పాల్గొన్నారు.