నార్పలలో ఘనంగా జయహో బీసీ మహాసభ

అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం, నార్పల మండలంలో జనసేన – తెలుగుదేశం ఉమ్మడి కార్యచరణలో భాగంగా మంగళవారం నార్పల మండలంలోని బి పప్పూరు గ్రామం సాయిబాబా గుడి వద్ద జయహో బిసి కార్యక్రమాన్ని సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సబ్యులు ఆలం నరసా నాయుడు మరియు కేశవరెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణ, వెంకట నరసా నాయుడుల ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నార్పల మండల జనసేన నాయకులు గంజికుంట రామకృష్ణ మరియు తుపాకుల భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసి కులాలను వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అ న్యాయం చేసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో 34% గా ఉన్న బీసీల రిజర్వేషన్ ని 10 శాతం తగ్గించి దాదాపు 16 వేల మంది బీసీ నాయకులని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసిన దుర్మార్గమైన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైసీపీ పార్టీ అని విమర్శించారు. బీసీలలో 56 ఉప కులాలు ఒక్కొక్క ఉప కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి కేవలం కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసి వాటికి నిధులు, విధులు లేకుండా చేసి బీసీలను మోసం చేశారు అన్నారు. కనీసం పట్టు రైతులకు సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల రక్షణ కోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి బీసీలపై జరిగే దౌర్జన్యాలను అడ్డుకునేలా కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా బీసీలకు వాటి ఉపకులాలకు కార్పొరేషన్ లో ఏర్పాటు చేసి నిధులను సమకూర్చి వారికే ఖర్చు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. జనసేన – టిడిపి ఉమ్మడి ప్రభుత్వం రాగానే బీసీల అందరికీ శాశ్విత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేయాలని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చడం జరిగిందన్నారు. గతంలో ఆదరణ పథకం కింద అనేక కులాల వారిగా పనిముట్లను ఇచ్చేవారని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆదరణ పథకాన్ని రద్దు చేసిందని తిరిగి మన ప్రభుత్వం రాగానే ఆదరణ పథకం ద్వారా వృత్తి సంబంధిత పనిముట్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి సభ్యులు ఆలం నరస నాయుడు మరియు ముంతిమడుగు కేశవరెడ్డి మరియు వెంకట నరస నాయుడు, సభాధ్యక్షులు బిసి జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణ, శివ బాల మరియు బిసి సంఘం నాయకులు, తెలుగుదేశం మండల కన్వీనర్ నాగప్ప, పెద్ద ఎత్తున కార్యకర్తలు టిడిపి అభిమానులు, నార్పల మండల జనసేనా నాయకులు పొన్నతోట రామయ్య, ఉట్టి నరసింహులు, జగదీష్, హరీష్, వినోదంలోకేష్, వినోదం నారాయణస్వామి, ఆలీ పవన్, రవి, హరికృష్ణ మరియు పెద్ద సంఖ్యలో జనసైనికులు మరియు టిడిపి నాయకులు పాల్గొనడం జరిగింది.