పెద్దాపురంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం

పెద్దాపురం పురపాలక సంఘం సహకారంతో, పెద్దిరెడ్డి పారతీశ్వర రావు గారి జ్ఞాపకార్థంగా “పచ్చదనం – పరిశుభ్రత” అనే అంశంతో “మన పెద్దాపురం” ఫేస్‌బుక్ సభ్యులు నరేష్ పెద్దిరెడ్డి, రాజేష్ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో భాస్కర్ కాలనీలోని ది టిన్ని అర్బన్ ఫారెస్ట్ వద్ద మొక్కల నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, పెద్దాపురం పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ సూరిబాబు రాజు ప్రారంభించారు. పెద్ద ఎత్తున కూటమి నాయకులు, ఫేస్‌బుక్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రజలందరి సహకారం అవసరం అంటూ నాయకులు పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment