జిల్లా విద్యాశాఖ అధికారి చేతుల మీదగా సత్కారం..!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాల నందు నిర్వహించిన సహిత విద్య నెలవారి సమీక్షా సమావేశంలో ప్రత్యేక ఉపాధ్యాయుల యూనియన్ ఇటీవలే ఉత్తమ సహిత విద్య ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఆర్.రమాదేవి మరియు ఎం.స్వర్ణలతను సత్కరించింది. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్.ఎస్ కె సలీం బాషా చేతుల మీదగా అభినందన జ్ఞాపికలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహిత విద్య సమన్వయకర్త ఎం వి వి సత్యనారాయణ మరియు ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment