రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు, కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, విద్యార్థిని విద్యార్థులకు, పెన్షనర్లకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, కార్మిక, కర్షకులకు, వాణిజ్య వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికీ కూడా పేరుపేరునా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, కొత్త సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా, ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, తీపి చేదు కలిస్తేనే జీవితం, కష్టం సుఖం తెలిస్తేనే జీవితం, ఆ జీవితంలో ఆనందోత్సవాలు పూయించేందుకు వచ్చిన తెలుగు సంవత్సరాది సందర్భంగా తెలుగు వారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపారు. ఈ నూతన సంవత్సరంలో ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించారు.
Share this content:
Post Comment