సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ

శనివారం వీరబల్లె మండలం, నేతి వాండ్ల పల్లె గ్రామం నందు నూతన సి.సి రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు, బిజెపి పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్ మరియు జనసేన పార్టీ నాయకులతో కలిసి చమర్తి జగన్ మోహన్ రాజు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మౌలిక వసతులకు కృషి చేస్తామని, ప్రతి పల్లెను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలియజేశారు. అంతకుముందు గ్రామంలో పర్యటించిన కూటమి నాయకులకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:

Post Comment