ఏలూరు 32వ డివిజన్ పరిధిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.64.08 లక్షలు ఎంపీ నిధులతో చేపడుతున్న పోలీస్ విశ్రాంతి బ్యారక్ నూతన భవనం నిర్మాణానికి ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలసి శంకుస్థాపన చేసిన ఏలూరు పార్లమెంటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ నూర్జహాన్ పెదబాబు, జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, టిడిపి జిల్లా అధ్యక్షులు గన్నీ వీరాంజనేయులు, డిఐజి అశోక్ కుమార్, ఎస్పి శివ ప్రతాప్ కిషోర్, జనసేన నాయకులు నారా శేషు, రాఘవయ్య చౌదరి, శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు.
Share this content:
Post Comment