వడ్డి జల్లుపుట్టుగ సమస్యలకు పరిష్కార హామీ

*జనసేన ఇంచార్జ్ దాసరి రాజు

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని డి.గొనపపుట్టుగ పంచాయతీ పరిధిలోని వడ్డి జల్లుపుట్టుగ కాలనీ సమస్యలను జనసేన ఇంచార్జ్ మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య, సీసీ రోడ్ల వీధుల మధ్యలో వర్షపు నీటి నిల్వ, పిచ్చి మొక్కల బెడదలను దాసరి రాజుకి వినతిపత్రం రూపంలో వివరించారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ, ఈ సమస్యలను ప్రభుత్వ విప్ మరియు ఇచ్చాపురం శాసనసభ సభ్యులు బెందాళం అశోక్ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, గ్రామ ప్రజలు, యువత, జనసైనికులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment