ఈసారి అల్లరోడు హిట్ కొట్టడం గ్యారెంటీ..

తెలుగులో‘నటకిరిటీ’ రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి కామెడీ హీరోగా ఇమేజ్ సంపాదించుకున్నాడు అల్లరి నరేష్. ఈ మధ్యే ‘మహర్షి’, ‘నాంది’ లాంటి సినిమాలతో తనను తాను మార్చుకుంటున్నాడు న‌రేశ్‌. కానీ తన మార్క్ కామెడీ మాత్రం మిస్ కాకుండా ఇప్పుడు బంగారు బుల్లోడుగా వస్తున్నాడు. నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం “బంగారు బుల్లోడు”. నందమూరి బాలకృష్ణ క్రేజీ టైటిల్ ‘బంగారు బుల్లోడు’తో జనవరి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ చూస్తుంటే నరేష్ ఖాతాలో ఈసారి హిట్ పడడం గ్యారెంటీ అని అంత నమ్ముతున్నారు.

ఈ సినిమాకు సతీష్ ముత్యాల డిఓపి. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో పోసాని, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, పృథ్వీ, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, రజిత తదితరులు నటించారు.