గుడివాడను, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వీరఘట్టం జనసైనికులు

  • జనసేనాని బస్సు యాత్రతో వైస్సార్సీపీ పాలనకు చరమగీతం

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసైనికుడు మత్స పుండరీకం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మరియు దొంగమంత్రులు సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర చేశారు. బస్సుయాత్రలో వైఎస్ఆర్సిపి నాయకులు వాడిన వాహనాలకు ఉండే రిజిస్ట్రేషన్ ఏ రాష్ట్రానిదో చెప్పాలి.. అది కూడా తెలియకుండా మన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. నువ్వు ఐటీ శాఖ మంత్రివా లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రివా అని ప్రశ్నించారు?. నీ మంత్రి పదవికి ఎంతవరకు న్యాయం చేసావు?.. నీవు మంత్రి పదవి చేపట్టిన నుండి ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి?, ఎంతమందికి ఐటీ ఉద్యోగలు కల్పిచారో చెప్పాలని? డిమాండ్ చేశారు. మీ వైస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యా కానుక, వసతి దీవెన, ఫీజ్ రియంబర్స్మెంట్ సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీకు ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేయడం చేతకాదు గాని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా? విశాఖపట్నంలో ఋషికొండ ఆక్రమించారు, భూకబ్జాలు జరుగుతున్నా నిమ్మకు నీరుఎత్తినట్టు వ్యవరిస్తున్నావు ఎందుకు? గుడివాడ అమరనాధ్ నీవు భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ గారి పాదాలు పట్టుకుని ప్రాధేయపడవలసిన రోజు ఒకటి వస్తుంది అని గుర్తు పెట్టుకో.. అని మత్స పుండరీకం అన్నారు. జనసేన జాని మాట్లాడుతూ ప్రజలకు సేవచేసెందుకు మంత్రివయ్యావా? లేక జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తిట్తెందుకు మంత్రివయ్యావా..?. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వవం, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి వైస్సార్సీపీ ప్రభుత్వం ఓర్వలేకపోతుంది. కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మీ వైస్సార్సీపీ పాలనకు చరమగీతం పాడనున్నారు. తాడేలా శ్రీరామ్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వైస్సార్సీపీ మంత్రులు కేవలం ఆటబొమ్మలు తప్ప అధికారికంగా ఏమి చేయలేని దుస్థితిలో వున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు?, ఇంతవరకు నిరుపేదలకు గృహ నిర్మాణాలు ఎందుకుచేపట్టలేదు?, పోలవరం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు? ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎక్కడ అని తాడేలా శ్రీరామ్ నాయుడు ప్రశ్నించారు.