చెరువును తలపిస్తున్న గూడూరు రోడ్డు: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు గూడూరు రోడ్డు పరిస్థితి పై స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ వందల మంది ప్రయాణించే గూడూరు – శారద పేట రోడ్డు అధ్వానంగా తయారైంది. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాదచారులు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి.

స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు నరకమే.

గూడూరు మండలం కేంద్రమైన గాంధీ బొమ్మ నుండి మసీదు వరకు మంచినీటి పైపు లీక్ కారణంగా రోడ్లు మీద పై నీళ్లు పొంగి పొర్లుతుంది.

ఆర్&బి అధికారులు గాని, అర్. డబ్ల్యు. ఎస్ అధికారులు గాని పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.

మంత్రి జోగి రమేష్ ఇదే మార్గం గుండా ప్రయాణిస్తుంటాడు.

ముఖ్యంగా అక్రమ మట్టి రవాణా టిప్పర్లు కూడా ఇదే రోడ్డు నుండి నిత్యం తిరగటం వలన రోడ్డు పూర్తిగా పాడైపోయింది.

గూడూరు మండలంలో ఉన్న వైసిపి నాయకులు (మంత్రి జోగు రమేష్ ఆదేశాలతో) కేవలం జనసేన నాయకులను వ్యక్తిగతంగా దూషించడానికి, కాపు కులాన్ని తిట్టడానికి పేరంటానికి వచ్చినట్టు అందరూ కట్టకట్టుకుని వచ్చి మరి ప్రెస్ మీట్ పెడతారు. కానీ స్థానికంగా ఉన్న ఇబ్బందులను పట్టించుకోరు. బడా కాంట్రాక్టు కూడా ఈ మండలంలోనే ఉన్నారు.

స్థానిక ప్రజల ఇబ్బందుల దృష్ట్యా, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే సంబంధిత అధికారులు, మంత్రి స్పందించి రోడ్ల మరమ్మతు చేయించవలసిన జనసేన పార్టీ నుండి పెడన నియోజకవర్గం జనసేన నాయకులు ఎస్ వి బాబు డిమాండ్ చేశారు.