ఇల్లు లేని మైనారిటీ ఆడబిడ్డకి అండగా నిలిచి గల్ఫ్ సేన – జనసేన మరియు జనసేన ఎన్.ర్.ఐ.సేవా సమితి(కువైట్)

చంద్రగిరి నియోజవర్గం దామలచెరువు పంచాయతీలోని మౌలాలి పేట వీధి లో నివసిస్తున్న తల్లి తండ్రి లేని దిల్ షాద్ అనే యువతి గత భారీ వర్షాల కారణముగా ఉన్న చిన్న పూరిగుడిసెను సైతం పోగొట్టుకుంది. అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు సామాన్య ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు.కానీ జనసేన నాయకులు చిత్తూరు జిల్లా కార్యదర్శి నాసీర్ మరియు ధామల చెరువు జనసైనికులు ఆమెకి జనసేన పార్టీ తరుపున ఆమెకి ఇల్లు కట్టివ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని చంద్రగిరి నియోజకవర్గంకి చెందిన ఎన్.ర్.ఐ.నాయకులు కంచన శ్రీకాంత్ దృష్టికి తీసుకువెళ్లారు.
పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కంచన శ్రీకాంత్ మరియు వారి మిత్రబృందం కె.డి.వి.స్. నారాయణ, పెంచల రాజు, కోలా మురళి, అల్లం ప్రేమ్ రాయల్, జగిలి ఓబులేసు, చందు రాయల్, కుంచ నగేష్, ప్రేమ్ శ్రీహరి, కొమ్మినేని బాలాజీ, రెడ్డిచెర్ల ఆంజనేయులు, ఆకుల సుమన్, పసుపులేటి రాజేష్, బుర్ర శివశంకర్, అక్కంగారి చలపతి, సుగుణ కలసి 30000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసారు. ఈ సందర్భంగా కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజా సేవే లక్ష్యం గా స్థాపించిన పార్టీ జనసేన పార్టీ అని ఎక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటారో, ఎక్కడ ఆర్తనాదాలు వినిపిస్తాయో అక్కడ వారిని ఆదుకోవాడానికి జనసేన పార్టీ ఉంటుందని తెలియజేసారు.