గల్ఫ్ సేన జనసేన ఆత్మీయ కలయిక

గల్ఫ్ సేన జనసేన ఆద్వర్యంలో యూఏఈలో ఆదివారం డిసెంబర్ 25న జనసేన ఆత్మీయ కలయిక దుబాయ్ లోని క్రీక్ పార్క్ లో జరిగింది. గల్ఫ్ సేన జనసేన ముఖ్య నాయకులు కేసరి త్రిమూర్తులు, కెడిఎస్ నారాయణ, ఉదయ కిరణ్, జాన్ బాబు పెనుమాల, యుగేందర్, ప్రసాద్ పెదిశెట్టి, సింగిరి రవికుమార్, రమేష్ గంధం, విజయ్ నామ, వీర ప్రసాద్, రంగ చిలక, చిన్న, రూనీల్, శ్రీకాంత్, సుబ్బు మరియు వీర మహిళలు సుమారు రెండు వందల మంది జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ సేన ముఖ్య నాయకులు కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ గల్ఫ్ సేన జనసేన ఆరు దేశాలు కువైట్, సౌదీ అరేబియా, కతర్, మస్కట్, బహరేన్ మరియు యూఏఈ జనసైనికులు కలయిక అని, గత 4 సంవత్సతాలుగా ఈ సంస్థ జనసేన అభివృద్ధి మరియు సేవా కార్యక్రమాలు ఏవిధంగా చేస్తున్నారు అని గుర్తుచేశారు. వచ్చే సంవత్సరం మార్చి మొదటి వారంలో గల్ఫ్ నుంచి సుమారు 200 మంది గల్ఫ్ ఎన్నారైలు జనసేన అధ్యక్షులు వారిని కలవబోతున్నట్లు తెలియచేశారు. గల్ఫ్ ఎన్నారైలు ఏ విధంగా జనసేనకు అండగా ఉండాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. త్వరలో పార్టీ నుంచి ఆదేశాలు రాగానే గల్ఫ్ సేన వచ్చే ఎలక్షన్ లో దృష్టిలో పెట్టుకుని గల్ఫ్ సేన జనసేన కార్యాచరణ రూపకల్పనకు చర్చ జరిగింది. ముఖ్యంగా వీర మహిళలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం కోసం తమ వంతు కృషి చేస్తాం అని, ఇండియాలో ఉన్న వారి బంధు మిత్రులు కుటుంబ సభ్యులతో మాట్లాడి రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ఆవశ్యకతను వివరించి, వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఓటు వేసేలా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వీర మహిళలు “యూఏఈ గల్ఫ్ జనసేన వీర మహిళలు” గ్రూప్ స్థాపించారు. ఈ సందర్భంగా కొంతమంది జనసేన పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలో చేరడం జరిగింది. చిన్నారులు క్రిస్మస్ కేక్ ను కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి గల్ఫ్ సేన జనసేన టీం ప్రత్యేక ధన్యవాదములు తెలియ చేశారు.