గుంతకల్లు జనసేన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

గుంతకల్లు నియోజకవర్గం, భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు పురస్కరించుకొని శుక్రవారం జనసేన పార్టీ అధ్వర్యంలో స్థానిక పాఠశాలలో జాతీయ పతాకాలను అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ 75వ సంవత్సరము ముగింపును పురస్కరించుకొని శుక్రవారం పాఠశాలలో జాతీయ పతాకాలను అందచేయడం జరిగింది. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేస్తే మనకు ఈ స్వతంత్రం వచ్చింది. మన జాతీయ పతాకం ఏ ఒక కులానిదో ఏ ఒక్క మతానిదో కాదు ప్రతి ఒక్కరిదీ అని తెలియచేస్తూ విద్యార్థులలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతూ ప్రసంగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, బోయ వీరేష్ కుమార్, కసాపురం సుబయ్యి, కసాపురం నంద, మణికంఠ, అర్ సీ సురేష్, పసుపులేటి ఓబులేశు, వెంకటేష్, సోహిల్ తదితరులు పాల్గొన్నారు.