గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది!!

  • 5 కోట్లకి చెరువు మట్టి అమ్ముకుని రోడ్డు గుంతలు చేయించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇరు పార్టీల నాయకులతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గం లో జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా ఆధ్వర్యంలో గుంతలమయమైన రోడ్లను బాగు చెయ్యాలని నిరసిస్తూ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం నుండి అక్కుర్థి కి వెళ్ళే మార్గంలో విపరీతమైన గుంతలు ఏర్పడ్డ రోడ్డులో ప్లే కార్డులు చూపుతూ హాష్ టాగ్ “#GunthalaRajyamAP #WhyAPHatesJagan” పేరుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినుత మాట్లాడుతూ పక్కనే మద్దిలేడు గ్రామానికి చెందిన చెరువు లో మట్టిని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి 5 కోట్లకి అమ్ముకున్నారని, వందల కొద్దీ టిప్పర్లు రాత్రి పూట మట్టి తరలించడానికి వెళ్లడంతో రోడ్డు తీవ్రంగా గుంతలమయం అయ్యిందని, కనీసం 5 కోట్లలో లక్ష రూపాయలు ఖర్చు పెట్టే గుంతలకి మట్టి కూడా వెయ్యని దుస్థితిలో ఉందని తెలిపారు. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో జనసేన- టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో అన్ని రోడ్లు పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ఉష చక్రాల, చైతన్య ఆదికేశవులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, పట్టణ ఉపాధ్యక్షుల తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు పేట చిరంజీవి, లక్ష్మి, కవిత, రాజ్య లక్ష్మి, బతెమ్మా, పేట చంద్ర శేఖర్, గురవయ్య, దినేష్, జ్యోతి రామ్, తులసీ రామ్, రాజేష్, సురేష్, హేమంత్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.