*వేలాది మంది భక్తజనులు, కురువ సంగీయులు మధ్య ఉరకలేసే ఉత్సాహంతో సాగిన రమణీయ రథోత్సవం..
గుంతకల్ పట్టణం, మహాశివరాత్రి సందర్భంగా కురువ సంఘం అధ్యక్షులు సోమశేఖర్, ఉపాధ్యక్షులు కనకవీటి రామప్ప, టిడిపి మాజీ కౌన్సిలర్ కురువ శివన్న, టిడిపి నాయకులు కనకవీటి మోహన్, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు కురవ పాండు కుమార్ ల ఆత్మీయ ఆహ్వానం మేరకు గుంతకల్లప్ప స్వామి రథోత్సవ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి ముఖ్య అతిథులుగా వాసగిరి మణికంఠ మరియు గుమ్మనూరు నారాయణ, విశిష్ట అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ దేవరగుడి జగదీష్ పాల్గొన్నారు. అనంతరం బీరప్ప స్వామి దేవాలయంలో కూటమి ప్రభుత్వంలో ప్రజల సుభిక్షంగా మెలగాలని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వేలాది భక్తజనుల మధ్య సర్వాంగ శోభితంగా అలంకరించిన రథాన్ని ప్రారంభించారు. ఈ రథాన్ని “కదిలివచ్చే ఆలయంగా” విజ్ఞులు అభివర్ణించారు. పాత గుంతకల్ పురవీధుల్లో వేలాది మంది భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి (జనసేన, తెలుగుదేశం, బిజెపి) నాయకులు, కురుబ సంగీయులు, భక్తజనులు వేలాదిగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:
Post Comment