ఉపయోగపడని ప్రభుత్వాన్ని పారదోలాలని పిలుపునిచ్చిన గునుకుల కిషోర్

నెల్లూరు, ప్రభుత్వం పని చేయకపోతే ప్రశ్నించే రోజులు దాటి ప్రభుత్వం చేత పని చేయించే రోజులు మొదలయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసూతి విభాగం నందు దాదాపుగా సంవత్సరం నుంచి పనిచేయని లిఫ్టు గురించి ప్రభుత్వ పని తీరును నిరసిస్తూ నెలరోజుల వ్యవధి ఇచ్చినా రిపేరు చేయక పోవటంతో ముందుకు వచ్చి యువత భిక్షాటన చేసి మరమ్మత్తులు చేయాలని తలపెట్టిన వారికి స్ఫూర్తినిస్తూ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించి, కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మితమైన ప్రభుత్వాసుపత్రి అన్ని వ్యాధులకు నయమయ్యే విధంగా రూపుదిద్దబడిందా లేదా అనేదే ప్రశ్నార్ధకమే. ఈ వైఫల్యం రూరల్ లో పార్టీ వైసిపి పార్టీ తరపున గెలిచి ప్రస్తుతానికి పక్కన ఉన్న శ్రీధర్ రెడ్డిదా? లేక స్థానికంగా అప్పట్లో మంత్రిగా నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ దా..? లేక ప్రస్తుత మంత్రి కాకానిదా..? లేకపోతే ప్రస్తుతం ఆరోగ్య మంత్రిగా ఉన్న విడదల రజినిదా? మొత్తానికి ఈ పాపం వైసిపిదే, పేదవారి ప్రసూతి సమయంలో కూడా ఉపయోగపడని ప్రభుత్వాన్ని పారదోలాల్సిందిగా నేను జనసేన పార్టీ తరపున పిలుపునిస్తున్నామని గునుకుల కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.