పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఫర్ ప్రీమియం సర్వీసెస్ ను ప్రారంభించిన గునుకుల కిషోర్

నెల్లూరు సిటీలో మూడో మైల్ సెంటర్ వద్ద “పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఫర్ ప్రీమియం సర్వీసెస్” అనే సెలూన్ ప్రారంభోత్సవంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల హాజరై, రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు పవన్ ప్రారంభించిన ఈ వ్యాపారం లాభదాయకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ, నెల్లూరు ప్రజలు ఈ ఆధునిక సేవలను అనుభవించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రీమియం సేవలు అందించే సెలూన్స్ కొరత ఉన్న నేపథ్యంలో, స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ పవన్ ప్రారంభించిన ఈ వ్యాపారాన్ని నెల్లూరుకు చెందిన ప్రజలు ప్రోత్సహించాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-04-11-at-6.57.02-PM-1012x1024 పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఫర్ ప్రీమియం సర్వీసెస్ ను ప్రారంభించిన గునుకుల కిషోర్

Share this content:

Post Comment