నెల్లూరు మున్సిపల్ కమీషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన గునుకుల కిషోర్

నెల్లూరు కార్పొరేషన్ కి భాధ్యతలు తీసుకున్న మున్సిపల్ కమీషనర్ వికాస్ మర్మత్ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్చంతో జనసేన పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్. గత కమిషనర్ కూడా స్థానిక సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండే వారిని ఏదైనా సమస్య వారి దృష్టికి తీసుకెళ్తే అధికారులతో చేయించి పలానా పని పూర్తయింది అని కూడా తెలిపే వారని, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ ప్రజాసేవ చేయడానికి మించిన బాధ్యత ఏమీ లేదని దానికోసమే మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఏదైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.