విజయనగరం, ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు చేసినందుకు రామభద్రపురం మండల జనసేన నాయకుడు మహంతి దనంజయపై కత్తితో దాడి చేయడం దారుణమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దనంజయ్ ని సోమవారం అయ్యలు పరామర్శించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ దనంజయపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు చేసినందుకు దాడి చేయడం దారుణమన్నారు. దాడులకు, బెదిరింపులకు జనసేన శ్రేణులు భయపడేది లేదని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తిరగబడి తరిమి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జనసైనికులకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడమోహన్ రావు, రాజేంద్ర, ఎంటి రాజేష్, పిడుగు సతీష్, ఎమ్.పవన్ కుమార్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment