బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన గురుదత్

  • కష్టాల్లో ఉన్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది గురుదత్

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండల, సీతానగరం గ్రామనికి చెందిన జొన్నకూటి స్వామి గత కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయారు. విషయాన్ని స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, స్వామి కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరుపున 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన మాటూరి అనంతలక్ష్మి మరణ వార్త విన్న గురుదత్, అనంతలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి జనసేన పార్టీ తరపున 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సీతానగరం మండల జనసేన పార్టీ కో-కన్వీనర్ కాత సత్యనారాయణ, రాజానగరం నియోజకవర్గం జనసేన వీరామహిళ కందికట్ల అరుణ కుమారి, కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, రాయపాటి ప్రసాద్, అప్పయమ్మ (ప్రసాద్), చల్లా ప్రసాద్ గ్రామ జనసైనికులు మాటూరి వెంకటేశ్వర్లు, పి. మణి, సాయి, ముని, రాజు, మురళి, రాజేష్, రమణ, సతీష్, రమేష్, బాలు, తులసిరామ్, రాజు, చీడీపీ నాగమణి, చిడిపి ఏసురత్నం, జొన్నపాటి రాణి, సుంకర వెంకటలక్ష్మి, సుంకర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.