బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామానికి చెందిన సేక రాంబాబు తాటాకు ఇళ్లు అగ్నిప్రమాదంలో దగ్ధమైంది, విషయాన్ని స్థానిక జనసేన పార్టీ నాయకుడు ముక్క రాంబాబు ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని తక్షణమే పరామర్శించి జనసేన పార్టీ తరుపున నిత్యవసర సరుకులు 5,000 రూపాయలు అధిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కరణం శ్రీను, మారిశెట్టి త్రిమూర్తులు, తర్ర నాని నందిగామ్ శేషాగిరి, బండి సౌమి, వెలిశెట్టి శ్రీను, లావేటి సుబ్రహ్మణ్యం, వేలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.