పంట నష్టపోయిన రైతులకు మద్దతుగా గురుదత్

రాజానగరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం పలు గ్రామాల్లో అధిష్టానం ఆదేశానుసారం అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జనశ్రేణులతో స్వయంగా రైతుల దగ్గరికి వెళ్లి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పంటల నష్టాన్ని పరిశీలించి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, కోరుకొండ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొచ్చర్ల బాబి, రాజానగరం మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ నాగవరుపు భానుసంకర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, పెద్ద కాపు, చల్లా ప్రసాద్ మరియు రైతులు పాల్గొన్నారు.