గుంటూరు, ఫిబ్రవరి 27వ తేదీన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేయుచున్నారు. వారికి మద్దతుగా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు యాజమాన్యాలతో గుంటూరు ఆర్ ఆగ్రహారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మేకల రవీంద్రబాబు గారు సభా అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని, సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని అన్నారు. అలాగే గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఏపాటి గౌరవం ఇచ్చిందో మీ అందరికీ తెలుసని, వైన్ షాపుల దగ్గర టీచర్లను నిలబెట్టి వారి మన గౌరవానికి భంగం వాటిల్లేలాగా ప్రవర్తించిన విషయం మనందరికీ తెలుసు అని అన్నారు. కానీ ఎన్.డి.ఏ ప్రభుత్వం పూర్తిగా మీకు అందుబాటులో ఉంటుందని, ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ప్రవేట్ టీచర్ల సమస్యల పరిష్కారంలో తమ గళాన్ని వినిపించి వాటిని పరిష్కరించగలరని అన్నారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా డిఎస్సీ వస్తుంది అని, ఇప్పటికే అందుకు సంబంధించి కావాల్సిన ప్రొచెస్స్ పూర్తి అయింది అని అన్నారు. అలాగే బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 1 కి ఎదురుగా “1” మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసినదిగా కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ సమాజంలో మంచి ఏదో చెడు ఏదో పౌరులకు నేర్పించే వ్యక్తులు గురువులని, సమాజానికి మంచి పౌరులను అందించేది గురువులని అలాంటి గురువులకు మంచి నాయకుడు సమాజానికి అవసరమని మనం చెప్పనవసరం లేదని, వారికి తెలుసని, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి మంచి నాయకుడికి టీచర్లు అందరూ నిలబడి పెద్దల సభకు పంపిస్తారని అన్నారు. అలాగే ప్రైవేట్ స్కూళ్లు మరియు యాజమాన్యాలకు సంబంధించిన సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వాటిని కూటమి ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఇప్పటికే అడుగులు వేసిందని అన్నారు. గత ఎన్నికలలో ఏ విధంగా అందరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారో అదే విధంగా ఎన్నికలలో కూడా అదేవిధంగా అండగా నిలబడి రాజేంద్ర ప్రసాద్ గారికి గెలిపించాలని కోరారు. కావున మీరు అందరూ కలిసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి అండగా నిలబడి బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ కి ఎదురుగా “1” మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మరియు మాజీ శాసన సభ్యులు కిలారి రోశయ్య మాట్లాడుతూ ఆలపాటి సమస్యలు తీర్చడంలో ఘనాపాటి అని, టీచర్లు మరియు పట్టభద్రుల అందరూ కలిసి ఆలపాటి కి పట్టం కట్టాలి అని అన్నారు. అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మరియు టీచర్లు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీద తమకు నమ్మకం ఉంది అని, వారికి తప్పక తమ మద్దతు ఉంటుందని అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీహరి, వంగా శ్రీనివాసరావు, బత్తుల వెంకట్రావు, వి ఆర్ మాస్టర్, ఆదిత్య, శివ నాగేశ్వరావు, పలువురు విద్యావంతులు, టీచర్స్ మరియు జనసేన పార్టీ జిల్లా కమిటీ నాయకులు, కార్పొరేటర్లు, నగర కమిటీ నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:
Post Comment