కుచెళ్ళపాడులో జనసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

వేమూరు మండలం, కుచెళ్ళపాడు గ్రామములో హనుమాన్ జయంతి వేడుకలు జనసేన ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. కొన్ని కారణాల వలన ఆదివారం జరగ వలసిన హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వేమూరు నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వెండి ప్రైమ్ గల షీల్డ్ లు పంపిణీ చేయడం జరిగింది. సోమరౌతు రామకోటేశ్వరరావు మరియు సోమరౌతుబ్రహ్మం ఈ కార్యక్రమం అంతటిని పర్యవేక్షించారు. అనంతరం భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జనసేన నాయకులు, జనసైనికులు, జిల్లా స్థాయి వేమూరు నియోజకవర్గ మరియు మండలాల స్థాయి నాయకులు పాల్గొన్నారు.