*రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యోగ సాధనతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంతో పాటు ఆనందం, ఆహ్లాదం ఏర్పడుతుంది. యోగా అనేది నిత్య జీవితంలో భాగమై, ప్రతి ఒక్కరి జీవన శైలిగా మారాలి” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ కరస్పాండెంట్ సేతు ఆధ్వర్యంలో నిర్వహించగా, బీజేపీ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, మదనపల్లి డీఎస్పీ మహేంద్ర, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, బండి ఆనంద్, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, గండికోట లోకేష్, గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, అర్జున్, పురం నాగేష్, చంద్రశేఖర్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Share this content:
Post Comment