భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు: బండారు శ్రీనివాస్

  • ప్రజలారా! నీతివంతుడైన జనసేనానిని ఆశీర్వదించండి!.. బండారు శ్రీనివాస్ పిలుపు!
  • నిజాయితీగల గొప్ప నాయకుడు జనసేనానికి అందరూ అండగా నిలబడాలి! ప్రజా సేవలో నీతిగా నిలబడే ప్రజా నాయకుడు జనసేనాని!

కొత్తపేట: అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి బండారు శ్రీనివాస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ నా ప్రజలకు, ఆడపడుచులకు, అక్కచెల్లెమ్మలకు, జన సైనికులకు, కార్యకర్తలకు, గ్రామ, మండల స్థాయి నాయకులకు, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులకు, వీరమహిళలకు, నియోజకవర్గ నేతలకు, అన్ని వర్గాల వారి అందరి ఇంట కోటి కాంతులతో సుఖసంతోషాలు నిండి ఉండాలి! ప్రతి ఒక్కరూ భోగి, సంక్రాంతి పండుగలను ఆనందాలతో అన్ని వర్గాలవారు కలిసిమెలిసి ఐకమత్యంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగ ఉత్సవాలలో, ఊరేగింపులు, జాతర్లలో, బాణాసంచా కాల్పులకు దూరంగా తగు జాగ్రత్తలు పాటిస్తూ, తమ తమ బిడ్డలను, చంటి బిడ్డలను జాగ్రత్తగా చూసుకుని, మాస్కులు ధరించి, తమ కుటుంబాలతో ఆనందంగా పండుగలను జరుపుకొని సంతోషంగా అందరూ ఉండాలని శ్రీనివాస్ కోరారు.