ఘనంగా బొబ్బేపల్లి సురేష్ జన్మదిన వేడుకలు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అలుపెరగని పోరాటయోధుడు ప్రజా సమస్యలపై నిరంతరం తన గళాన్ని వినిపిస్తూ ఎన్నో సమస్యలని పరిష్కరిస్తూ సర్వేపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిడిలు చేసినా వెనకడుగు వేయకుండా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకి కొనసాగుతున్న బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన్మదిన పురస్కరించుకొని సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మండలంలోని సర్వేపల్లి జనసేన పార్టీ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి, బాణసంచా బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత బలంగా పార్టీని తీసుకువెళ్లాలని చెప్పి మనస్పూర్తిగా కోరుకుంటున్నమన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం భాయ్, పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, సందీప్, అక్బర్, చిన్న, గిరీష్, రహమాన్, తదితరులు పాల్గొన్నారు.